‘భూతం ప్రేతం’ నుంచి న్యూ ఇయర్ స్పెషల్‌గా అదిరిపోయే అప్డేట్

by Mallepaka Hamsa |

సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ బ్యానర్ల మీద బి. వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాజేష్ ధృవ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భూతం ప్రేతం’(bhotham pratham).

‘భూతం ప్రేతం’ నుంచి న్యూ ఇయర్ స్పెషల్‌గా అదిరిపోయే అప్డేట్
X

దిశ, సినిమా: సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ బ్యానర్ల మీద బి. వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాజేష్ ధృవ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భూతం ప్రేతం’(bhotham pratham). ఈ మూవీలో యాదమ్మ రాజు(Yadamma Raju), బిందాస్ భాస్కర్(Bindas Bhaskar), ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత రావు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. తాజాగా, న్యూ ఇయర్ స్పెషల్‌గా పార్టీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘చికెన్ పార్టీ’ అంటూ సాగే ఈ పాటను రాజేష్ ధృవ రాయగా.. అనిరుధ్ శాస్త్రి ఆలపించారు. గిరీష్ హోతుర్ ఇచ్చిన బాణీ పార్టీ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. ఇక ఈ పాటను వింటుంటే.. పార్టీ మోడ్‌కు సరిపోయే పాటలా ఉంటుంది. ఈ పాటలో యాదమ్మ రాజు, బిందాస్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, రాజేష్ ధృవ వంటి సందడి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Next Story