- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బైరాన్‌పల్లిలో మొదలైన తిరుగుబాటు అక్కడే సమాధి కావాలి’.. అంచనాలను పెంచుతున్న ‘ఛాంపియన్’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్(Roshan) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ‘ఛాంపియన్’ (Champion)మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రోషన్(Roshan) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ‘ఛాంపియన్’ (Champion)మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రదీప్ అద్వైతం(Pradeep Advaitam) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షింPradeep Advaitamచే ప్రయత్నాలు మొదలెట్టారు. తాజాగా, ‘ఛాంపియన్’ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ట్రైలర్ విషయానికొస్తే.. 1947 స్వాతంత్య్రం కంటే ముందే జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో కథ నడవనుందనే భావన కలుగుతోంది.
గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, బ్రిటిష్ వారు చేసిన దౌర్జన్యం, చివరకు వారిపై నిలిచిన యువత ధైర్యం కథలో హైలైట్ అయే అవకాశం కనిపిస్తోంది. ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ మరియు ఇంటెన్సిటీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బ్రిటిష్ వారితో జరిగిన పోరాటం, రక్తపాతం, కాల్పుల సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ కానున్నాయి. మరీ ముఖ్యంగా – “బైరాన్‌పల్లిలో మొదలైన తిరుగుబాటు ఆ గడ్డమీదే సమాధి కావాలి” అని రోషన్ చెప్పిన డైలాగ్ అంచనాలను రెట్టింపు చేస్తోంది.రోషన్ లుక్ పూర్తిగా కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
గత సినిమాల కంటే భారీగా ఒవర్‌హాల్ అయిన బాడీ టోన్ మరియు డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరోవైపు, అనస్వర రాజన్ పాత్రలో భావోద్వేగాలకు మంచి స్థానం ఉందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. టెక్నికల్ వైపు చూసినా ‘ఛాంపియన్’ బలంగా కనిపిస్తోంది. ‘ఛాంపియన్’పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. నిజ సంఘటనల ఆధారంగా వస్తున్న పీరియాడిక్ డ్రామా కావడంతో ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






