రాఖీ పండుగ కానుకగా ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-29 06:26:02  IST  )

కోలీవుడ్ నటుడు సూరి(suri), ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మామన్’(Maman).

రాఖీ పండుగ కానుకగా ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు సూరి(suri), ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మామన్’(Maman). ఈ చిత్రాన్ని ప్రశాంత్ పాండియరాజ్(Prashant Pandiaraj) తెరకెక్కించగా.. కుటుంబంలో కనిపించే బాంధవ్యాలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకుల మందుకు తీసుకువచ్చారు. జీవితంలో మేనమామ బంధం గొప్పదని, అది తల్లి తర్వాత స్థానం అని ఈ చిత్రం ద్వారా అందరికీ తెలిసేలా చేసి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. రాజ్ కిరణ్(Raj Kiran), రాజేంద్రన్, స్వాసిక కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మే 16న థియేటర్స్‌లోకి వచ్చింది.

మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసును షేక్ చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత ‘మామన్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సంస్థ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. ‘మామన్’ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోగా.. రాఖీ పండుగ సందర్భంగా.. ఆగస్టు 8 నుంచి తమిళ భాషలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్‌లో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

link

Next Story