ఇండస్ట్రీలో పక్షపాత ధోరణి మారాలి.. వారి నిజస్వరూపాలు బయటపడతాయి.. దుమారం రేపుతున్న ప్రభాస్ బ్యూటీ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-22 13:06:10  IST  )

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘ది రాజాసాబ్’(The Rajasaab)సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఇండస్ట్రీలో పక్షపాత ధోరణి మారాలి.. వారి నిజస్వరూపాలు బయటపడతాయి.. దుమారం రేపుతున్న ప్రభాస్ బ్యూటీ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) ‘ది రాజాసాబ్’(The Rajasaab)సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిద్ది కుమార్, నిధి అగర్వాల్(Nidhi Agarwal), సంజయ్ దత్, యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక నిత్యం మాళవిక మోహనన్ నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ‘ది రాజాసాబ్’గురించి పలు కామెంట్లు చేస్తోంది. తాజాగా, మాళవిక ఇండస్ట్రీలో నటీనటులకు, హీరోలకు చూసే ధోరణి మారాలంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది.

‘‘ఇండస్ట్రీలో స్త్రీ, పురుషులను చూసే విధానంలో తేడా ఉండకూడదు. ముఖ్యంగా నటులకు లభించే మర్యాద నటీమణులకు లభించడం లేదు. హీరోలకు అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. కానీ హీరోయిన్లకు అడిగినంత లో తగ్గించి ఇస్తుంటారు ఇందే అన్యాయమో నాకు అర్థం కావడం లేదు. ముందు ఇండస్ట్రీలో పక్షపాత ధోరణి మారాలి. అలాగే సినీ పరిశ్రమలో ఉన్న వారు కొందరు కనిపించే అంత మంచి వాళ్ళు కాదు. సమయం వచ్చినప్పుడు వారి నిజస్వరూపాలు బయటపడతాయి. గత పదేళ్ల నుంచి నేను చాలామందిని చూశాను. కొందరు కెమెరా ముందు ఒకలాగా.. వెనుక మరోలా కనిపించడం నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే బయటకు మనతో మంచిగా కనిపించే వారి నిజస్వరూపాన్ని అంత త్వరగా తేల్చలేము. కాబట్టి ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు వేయడం మంచిది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాళవిక కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Next Story