- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన యాంకర్.. స్టేజీ మీదే కొట్టిన బాలయ్య
బాలయ్యకు గులాబీని ఇచ్చి సరదాగా ప్రపోజ్ చేసింది.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)వరుస సినిమాలతో పాటు పలు ఈవెంట్లకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాజాగా, వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన ‘అన్విత బిల్డింగ్ హ్యాపీనెస్’ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో బాలయ్య తన మార్కు స్పీచ్‌తో అభిమానులను ఉత్సాహపరుస్తుండగా, ఊహించని ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్న అమ్మాయి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బాలయ్యకు గులాబీని ఇచ్చి సరదాగా ప్రపోజ్ చేసింది. దీంతో అది చూసిన బాలయ్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, వెంటనే తేరుకున్న ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఆ గులాబీ పువ్వును తీసుకున్న బాలయ్య, సరదాగా ఆ యాంకర్ చెంపపై అదే పువ్వుతో కొట్టారు.
రిటర్న్ గిఫ్ట్ అదిరిపోయింది..
ఇది చూసిన అక్కడి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బాలయ్య రియాక్షన్ చాలా స్పోర్టివ్‌గా ఉండటంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "బాలయ్య బాబు టైమింగ్ మామూలుగా ఉండదు" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియలు అన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. కొందరు నెటిజన్లు బాలయ్య వేగంగా స్పందించిన తీరును మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆ యాంకర్ చేసిన పనికి బాలయ్య ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అదిరిపోయిందని సరదాగా చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే బాలయ్య, ఇలాంటి చిలిపి పనులతో తనలోని సాఫ్ట్ యాంగిల్‌ను బయటపెట్టడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మొత్తానికి వాలెంటైన్స్ డే వేళ బాలయ్య చేసిన ఈ పని నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.






