- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని హీరో.. నెట్టింట సెన్సేషనల్‌గా మారిన ఫొటో
‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ ఫొటో నెట్టింట దుమారం రేపుతోంది. అక్కినేని హీరో సుమంత్(sumanth)తో ఈ బ్యూటీ చాలా క్లోజ్‌గా సోఫాలో కూర్చోని స్టిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఇద్దరి డ్రెస్ కలర్‌లు కూడా మ్యాచ్ కావడం మరింత సెన్సేషన్‌గా మారింది. అయితే గత కొన్ని రోజులుగా సుమంత్ సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మతో దిగిన ఫొటో దర్శనమివ్వడంతో అందరు షాక్ అవుతున్నారు. మృణాల్, సుమంత్ మ్యారేజ్ చేసుకుంటున్నారా అని గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారగా.. ఫొటో బాగుంది.. దానితో పాటు మీ జంట ఇంకా చాలా బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.






