- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్ చెప్పిన నటి.. ప్రిన్స్ మా జీవితంలోకి వచ్చాడంటూ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ వితికా శేరు(Vithika Sheru) పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ వితికా శేరు(Vithika Sheru) పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. కానీ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. ఈక్రమంలోనే టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh)తో ప్రేమ పడింది. కొద్ది కాలం ఎంజాయ్ చేసిన వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో జంటగా పాల్గొన్నారు. కానీ విన్నర్స్ కాలేకపోయారు. కొద్ది రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక వరుణ్ సందేశ్ సినిమాలు చేస్తుండగా.. వితికా మాత్రం ఇండస్ట్రీకి దూరం అయి సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. తాజాగా, వితికా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
తన కుటుంబంలోకి మగబిడ్డ వచ్చినట్లు తెలుపుతూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అయితే ఆ ఫొటోలు సడెన్‌గా చూసిన వారంతా ఆమె కొడుకే అని కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్లై తొమ్మిదేళ్లు అవుతున్నప్పటికీ పిల్లలు లేని ఈ జంట బాబుతో కనిపించడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచారా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ అతను తన చెల్లెలు క్రితికా పుట్టిన బాబు. ఈ విషయాన్ని తెలుపుతూ వితికా.. ‘‘ మా పిల్లలు మా ఆనందాల మూటను మాకు అందించారు. ఇప్పుడు మేము పెదమ్మ, పెదనానా అయ్యాము. ఇప్పుడు మా హృదయాలు మరింత పెద్దవయ్యాయి. ఒక అందమైన మగబిడ్డ మా జీవితంలోకి అడుగుపెట్టాడు. తనతో పాటు అంతులేని ప్రేమ, వెలుగు మరియు ఆనందాన్ని తీసుకువచ్చాడు.
ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు నిజంగా సరిపోవు. మా కుటుంబానికి ఈ అమూల్యమైన ఆనందాల మూటను ప్రసాదించినందుకు ఈ విశ్వానికి చాలా కృతజ్ఞతలు. అమ్మ చాలా బాగుంది, మరియు మా హృదయాలు ఇప్పటికే ప్రేమతో నిండిపోయాయి’’ అనే క్యాప్షన్ జత చేసింది. కాగా.. వితికా శేరు చెల్లెతు క్రితికా 2022లో కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ విషయాన్ని.. అర్థం చేసుకున్న వరుణ్, వితికా తల్లిదండ్రుల స్థానంలో ఉండి వీరి పెళ్లి చేశారు. ఇక ఇటీవల కృతిక ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇప్పుడు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.






