- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరో నన్ను ఆడిషన్‌కు పిలిచి దారుణంగా ప్రవర్తించాడు.. దుర్మార్గుడు అంటూ నటి సెన్సేషనల్ కామెంట్స్
ఇటీవల కోలీవుడ్ హీరో అజ్మల్ (Ajmal)చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఇటీవల కోలీవుడ్ హీరో అజ్మల్(Ajmal) చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆయన ఓ మహిళతో సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడినట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో అది చూసిన వారంతా పలు విమర్శలు చేశారు. ఇక ఈ క్రమంలోనే అజ్మల్ కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, తమిళ హీరోయిన్ నర్విని దేరి(Narvini Dery) పలు సంచలన విషయాలు బయపెట్టింది.
‘‘2018లో నేనే చెన్నైలోని ఓ మాల్‌లో అజ్మల్‌ను కలిశాను. అప్పుడు అతను తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్‌ను వెతికే పనిలో ఉన్నానని నాతో చెప్పాడు. అలా మాట్లాడుతూ నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మరుసటి రోజే నాకు ఫోన్ చేసి ఆడిషన్‌కి రావాలని చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. డెన్మార్క్ వెళ్లాల్సి ఉందని రావడం కుదరదని చెప్పాను. అయినప్పటికీ తను బలంవంతం పెట్టడంతో వెళ్లాను. అక్కడికి వెళ్లగానే ఏదో అసహజంగా అనిపించింది. రూమ్‌లో ఆయన ఒక్కడే ఉండటంతో.. మిగతా వారంతా ఎక్కడ అని అడిగితే బయటకు వెళ్లారని చెప్పాడు. ఆడిషన్ పేరుతో ఏదో తప్పు జరుగుతుందని నాకు అర్థమైంది.
ఇంతలోనే నా పట్టుకొని డ్యాన్స్ చేద్దామన్నాడు. నేను చేయనని చెప్పాను.. మీ ఉద్దేశం నాకు అర్థమైంది దానికోసం నేను రాలేదని చెప్పాను. అయినప్పటికీ అతను మాత్రం నా వెనక ఎంతోమంది అమ్మాయిలు పడతారని అన్నాడు. ఆ దుర్మార్గుడు నన్ను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. అప్పుడే ఫోన్ వచ్చింది. నేనే ఆ సమయంలో నన్ను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాను. వెంటనే బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను. కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను.. కానీ నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఇవ్వలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






