భిక్షాటన చేస్తూ.. దీనస్థితిలో నటుడు కన్నుమూత..!

by Disha Web Desk 9 |
భిక్షాటన చేస్తూ.. దీనస్థితిలో నటుడు కన్నుమూత..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ నటుడు మోహన్(55) అత్యంత దీనస్థితిలో కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం సమీపంలో రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసుల విచారణలో ఆ మృతదేహం సేలం జిల్లా మేటూర్‌ గ్రామానికి చెందిన సహాయ నటుడు మోహన్‌ది అని తేలింది. ఆయన ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ తో కలిసి ‘అపూర్వ సోదరులు’ అనే సినిమాలో నటించారు. నాన్ కడవుల్, అదిశయ మనిదర్‌గళ్ తదితర హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. కొన్నాళ్లుగా అవకాశాలు లేకపోవడంతో భిక్షాటన చేసుకుంటున్నట్లు సమాచారం. అలా పేదరికం, అనారోగ్య సమస్యల వల్లే చనిపోయాడని తెలుస్తొంది. ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read More: దొంగోడే దొరగాడు.. ‘బెదురులంక 2012’ నుంచి సాంగ్ రిలీజ్..!

Next Story

Most Viewed