నగ్న ప్రదర్శనతో నటుడు రచ్చ.. ఛీ ఛీ కనీసం ఆకులైనా కట్టుకోవాల్సిందిగా అంటూ నెటిజన్లు ఫైర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-11 02:43:52  IST  )

బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ (Vidyut Jammwal)అంటే యాక్షన్, ఫిట్‌నెస్, సాహసం అనే పదాలు గుర్తుకు వస్తాయి.

నగ్న ప్రదర్శనతో నటుడు రచ్చ.. ఛీ ఛీ కనీసం ఆకులైనా కట్టుకోవాల్సిందిగా అంటూ నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ (Vidyut Jammwal)అంటే యాక్షన్, ఫిట్‌నెస్, సాహసం అనే పదాలు గుర్తుకు వస్తాయి. పలు సినిమాల్లో విలన్ పాత్రలతో మొదలైన ఆయన కెరీర్.. క్రమంగా హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన చూపించే డెడికేషన్ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇటీవల ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘మదరాసి’ (Madharaasi) సినిమా విద్యుత్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది. ఇదిలా ఉండగా, త్వరలోనే హాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘స్ట్రీట్ ఫైటర్’ రీబూట్ మూవీలో విద్యుత్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా విద్యుత్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫిట్‌నెస్, యోగా, సాహసోపేతమైన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తరచూ షేర్ చేస్తుంటాడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆయన చేసే పోస్టులు ట్రోలింగ్‌కు కూడా దారి తీస్తుంటాయి. ముఖ్యంగా నగ్నంగా లేదా అతి బోల్డ్‌గా కనిపించే ఫొటోల కారణంగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, విద్యుత్ నగ్నంగా చెట్టు ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

ఇక ఈ వీడియోను స్వయంగా విద్యుత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించడం గమనార్హం. ‘‘కలరిపయట్టు సాధకుడిగా, నేను ఏడాదికి ఒకసారి ‘సహజ’ అనే యోగ ప్రక్రియను ఆచరిస్తాను. సహజ అంటే మన సహజసిద్ధమైన స్థితికి, ప్రవృత్తికి దగ్గరగా వెళ్లడం. ఇది ప్రకృతితో, మన అంతరాత్మతో మమేకమయ్యేలా చేస్తుంది. శాస్త్రీయంగా ఇది నాఢీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంచుతుంది’’ అని రాసుకొచ్చాడు. న్యూడ్‌గానే ఐస్‌లో కూర్చొని దండం పెడుతూ ఉన్న ఫొటోతో వీడియో ఎండ్ అయింది. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది చూసిన వారంతా సిగ్గులేదా? కనీసం ఆకులైనా కట్టుకోవాల్సింది కదా అని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రంబోల్డ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Next Story