ఆ కారణంతోనే వరలక్ష్మిని విశాల్ వదిలేశాడా?

by Disha Web Desk 10 |
ఆ కారణంతోనే వరలక్ష్మిని విశాల్ వదిలేశాడా?
X

దిశ, సినిమా: తమిళ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక తన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇదిలావుంటే.. విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్‌లపై పలు రూమర్లు వినిపించాయి. విశాల్‌తో చాలా కాలం ప్రేమలో ఉన్న ఆమె.. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలోనే విశాల్ ఆమెకు దూరమయ్యాడట. అయితే ఇద్దరు విడిపోవడానికి కారణం వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్‌, విశాల్‌కు మధ్య గొడవలేనట. అలాగే వరలక్ష్మీ మొండితనం కూడా విశాల్‌కు నచ్చలేదట. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ వీరిద్దరూ దూరంగానే ఉంటున్నారు.

Read more:

Actress Shriya Saran Stylish And Hot Photo Gallery

Next Story

Most Viewed