- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు సినిమాలు అందుకే రూ. 1000 కోట్లు రాబడుతున్నాయి.. ఆ నిర్మాతను ఆకాశానికెత్తేసిన శివ కార్తికేయన్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Shiva Kartikeyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మదరాసి’(Madharaasi).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Shiva Kartikeyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మదరాసి’(Madharaasi). ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రాబోతుంది. విద్యుత్ జమ్యాల్, బిజు మీనన్, విక్రాంత్, షాబీర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ‘‘ప్రముఖ నిర్మాత ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన చాలా పెద్ద సినిమాలను నిర్మించారు. కంటెంట్ నచ్చితే ఆయన ఖర్చు విషయంలో రాజీ పడరు. తెలుగు సినిమాలు అందుకే తరచూ రూ. 1000 కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. రుక్మిణి చాలా టాలెంటెడ్ హీరోయిన్. ఆమెతో కలిసి నేను మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. ‘మదరాసి’ సక్సెస్ కంటే మీ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.






