- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకే ఇంత పెద్ద సాహసం చేశా.. కానీ అందరూ పిచ్చిదానిలా చూశారు: ఆండ్రియా జెర్మియా
యంగ్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah)వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah)వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇటీవల ‘మాస్క్’ చిత్రంతో వచ్చి ప్రేక్షకులను అలరించిన ఈ భామ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తుండటంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా ఓ పెద్ద సాహసమే చేసినట్లు వెల్లడించింది. ‘‘నాకు ఒక స్టోరీ నచ్చడంతో నిర్మాత చొక్కలింగం(Chokkalingam)తో కలిసి ‘మాస్క్’ (Mask)నిర్మించాం. ఇందులో దర్శకుడు వెట్రిమారన్ భాగస్వామి కాదు. మా ప్రాజెక్ట్‌కు ఆయన ఒక మెంటర్ మాత్రమే. ఎన్నో సంవత్సరాలు శ్రమించి ఓ ఇల్లు నిర్మించుకున్నాను. ఆ ఇంటిపై రుణం తీసుకుని ఈ సినిమా తీశాను. ఈ విషయం తెలిసి నన్ను పిచ్చిదానిలా చూశారు. కానీ మూవీస్‌లో వచ్చిన సంపాదనతోనే ఇల్లు నిర్మించాను కాబట్టి నాకు నచ్చిన కథతో మూవీ చేయడం కోసం రుణం తీసుకోవడంలో తప్పులేదని భావించా. అందుకే ఇంత పెద్ద సాహసం చేశాను. నేను నటించిన మనుషి, పిశాచి-2తో మరో మూవీ విడుదల కాకపోవడంతో చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు స్వయంగానే నేను ఈ మూడు సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి నిర్మాతగా మారిపోతానని క్లారిటీ ఇచ్చింది.






