Tamannaah : ఆ ఒక్క విషయం నన్ను ఎక్కువగా బాధిస్తుంది

by Disha Web Desk 9 |
Tamannaah : ఆ ఒక్క విషయం నన్ను ఎక్కువగా బాధిస్తుంది
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తన అందం, నటనతో కట్టిపడేస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌, కోలీవుడ్‌ను ఏలేసింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదే రేంజ్‌లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘నేను 14 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. కానీ మీ అమ్మాయిని మూవీస్‌లోకి ఎందుకు పంపుతున్నారు? అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? అని చాలా మంది ఆంటీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నా తల్లిదండ్రులను భయపెట్టారు. వారి మాటలు పట్టుకుని కూర్చుంటే.. ఇప్పడు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. అయినప్పటికీ నా సినీ కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అవే నాకు పాఠాలు నేర్పాయి. ఇప్పుడు వచ్చి తమన్నా అలా ఇలా అని ట్విట్టర్ అంకుల్స్ కామెంట్స్ చేస్తే నేనెందుకు పట్టించుకుంటాను. కానీ ముఖ్యంగా ముక్కు మొహం తెలియని వ్యక్తులు చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ను హైలైట్‌ చేస్తూ వార్తలు సృష్టించడమే నన్ను బాధిస్తుంది. వర్క్ విషయంలో ఏమైనా అనండి.. మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను. కానీ లేనిపోని మాటలు మాత్రం అనకండి’ అంటూ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పేసింది.



Next Story

Most Viewed