- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను గ్రేట్‌గా ఫీలయిన మూమెంట్ అది: సుహాస్
నా ముందే ఒకాయన సెట్‌లో ఇంతనెందుకు పిలిచారు? కానీ కట్ చేస్తే కీర్తిసురేష్‌తో కలిసి ఉప్పు కప్పురంబు అనే సినిమా చేశాను.

దిశ, సినిమా: సుహాస్(Suhas), శివానీ నాగరం (Shivani Nagaram)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హే బలవంత్’(hey balwanth). ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్(Naresh), యాంకర్ స్రవంతి కీలక పాత్రలో మెప్పించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్, నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించగా.. వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘‘డేట్‌లు మారినా, టైటిల్ మారినా, ఫిబ్రవరి 20న మా సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ మారదు. ఈ మూవీ చూసి వెళ్లేటప్పుడు అందరి హృదయాలు బరువెక్కుతాయి. ఆడియన్సకు పైసా వసూల్ సినిమా. హాండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా ఇది’’ అన్నారు.
నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ నుంచి వస్తున్న మొదటి ప్రాజెక్ట్. ఇరవై కథలు విన్న తరువాత గోపీ చెప్పిన కథ నచ్చి. త్వరితగతిన షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. సుహాస్ మాట్లాడుతూ ''టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. నా తోటి ఆర్టిస్టులు ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ పెట్టారు. నా కెరీర్‌లో మజిలీ సినిమాతో బ్రేక్ వచ్చింది. మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ సమయంలోనే పెద్ద హీరోయిన్‌తో ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది. అందులో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అది. నా ముందే ఒకాయన సెట్‌లో ఇంతనెందుకు పిలిచారు? కానీ కట్ చేస్తే కీర్తిసురేష్‌తో కలిసి ఉప్పు కప్పురంబు అనే సినిమా చేశాను. నేను గ్రేట్‌గా ఫీలయిన మూమెంట్ అది. ఎవరైనా మిమ్మలను తక్కువ చేసి మాట్లాడితే మీరు నవ్వి ఊరుకోండి.. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇక 'హే బల్‌వంత్'తో నాకు పెద్ద హిట్ వస్తుందని నమ్ముతున్నాను' అన్నారు.






