- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సంస్థకే ‘వీరభద్రుడు’ తెలుగు థియేట్రికల్ రైట్స్.. అఫీషియల్ ప్రకటన చేసిన మేకర్స్
‘వీరభద్రుడు’ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందుండే సూర్య, ఈసారి ప్రముఖ దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘వీరభద్రుడు’ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది. నాగార్జున నేతృత్వంలోని ఈ సంస్థ పంపిణీ బాధ్యతలు చేపట్టడంతో, తెలుగులో ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దొరకడమే కాకుండా, ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత సూర్య సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ గతంలో పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది, ఇప్పుడు ‘వీరభద్రుడు’తో రాబోతున్నారు.






