భర్త ఉండగానే ఆ స్టార్ హీరో క్రష్ అంటున్న ప్రియమణి.. అలా చేయాలని కోరికగా ఉందట!

by Disha Web Desk 6 |
భర్త ఉండగానే ఆ స్టార్ హీరో క్రష్ అంటున్న ప్రియమణి.. అలా చేయాలని కోరికగా ఉందట!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

అయితే ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రియమణి చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుల్లో ఎవరిపైనైనా క్రష్ ఉందా? అని యాంకర్ అడగ్గా.. దానికి ప్రియమణి స్పందిస్తూ.. ”బాలీవుడ్ నటుల్లో ఎవరి స్టైల్ వారిదే. నాకు చాలా మంది నటులు ఇష్టం. కొన్ని అభిమాన పాత్రలు కూడా ఉన్నాయి. అయితే నాకు ఫస్ట్ నుంచి క్రష్ ఉన్న ఏకైక స్టార్ హీరో మాత్రం షారుఖ్ ఖాన్. లక్కీగా ఆయనతో వర్క్ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్‌లు చేయాలని కోరికగా ఉంది’’ అని ప్రియమణి సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed