- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పార్ట్‌పై దురదపెడితే నన్ను పిలువు అని వేధించాడు.. స్టార్ హీరోపై రాధికా అప్టే సంచలన వ్యాఖ్యలు!
గత కొద్ది కాలంగా ఎంతోమంది హీరోయిన్లు తాము క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఎంతోమంది హీరోయిన్లు తాము క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు భయపడి వెనకడుగు వేస్తుంటే.. మరికొందరు మాత్రం తమకు జరిగిన అనుభవాలు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా, మరో హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ ఎదురైనట్లు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే(Radhika Apte) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ‘‘ఒక ప్రముఖ తెలుగు స్టార్ హీరో ఎలివేటర్‌లో వెళ్తున్నప్పుడు నాతో అసభ్యకరంగా మాట్లాడాడు.
నిజానికి ఆ హీరోకు నాకు అంత పరిచయం లేనప్పటికీ కావాలని నాతో అతిగా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టాడు. ఎప్పుడైనా అర్థరాత్రి వేళ.. మీ బ్యాక్ దురదపెడితే.. నన్ను పిలవండి.. నేను మీ రూమ్‌కి వచ్చి రుద్దుతా అని వేధించాడు. దీంతో అది విని నేను షాక్ అయ్యాను. వెంటనే వాట్ అని చాలా సీరియస్ అయి తిట్టాను. పెద్ద గొడవ చేశాను.. దీంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని చెప్పుకొచ్చింది. కానీ ఆ హీరో పేరును మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం రాధికా అప్టే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అసలు ఆ హీరో ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.






