ఆ పాత్ర వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది.. కన్నీరు పెట్టుకున్న భూమిక

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-05 11:45:12  IST  )

భూమిక చాలా కాలం తర్వాత 'యుఫోరియా'(Euphoria) అనే సోషల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఆ పాత్ర వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది.. కన్నీరు పెట్టుకున్న భూమిక
X

దిశ, సినిమా: భూమిక చాలా కాలం తర్వాత 'యుఫోరియా'(Euphoria) అనే సోషల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహించగా.. ఇందులో గౌతమ్ మీనన్, సారా అర్జున్, పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను నీలిమ గుణ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమైంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘యుఫోరియా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇందులో పాల్గొన్న భూమిక ఎమోషనల్ స్పీచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ.. ‘యుఫోరియా’లో తన పాత్ర చాలా బరువైనదని తెలిపింది. షూటింగ్ సమయంలో అనేక రాత్రులు నిద్ర పట్టలేదని, పాత్రలోని భావోద్వేగాలు తనను వెంటాడాయని చెప్పింది. “అర్ధరాత్రి 1 గంట, 2 గంటల సమయంలో నిద్రలేచి ఆ పాత్ర గురించే ఆలోచించేదాన్ని.

ఆ ఎమోషన్స్ నుంచి బయటకు రావడం నాకు చాలా కష్టంగా అనిపించింది” అని ఆమె వెల్లడించింది. షూటింగ్ సమయంలో సెట్స్‌లో కూడా అనేకసార్లు భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని భూమిక తెలిపింది. కొన్ని సన్నివేశాలు తనను లోపల నుంచి కుదిపేశాయని, ఆ పాత్ర కోసం మానసికంగా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొంది. మాట్లాడుతున్న సమయంలో భూమిక ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘యుఫోరియా’ నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని, అందులోని సామాజిక అంశాలే తనను ఎక్కువగా ప్రభావితం చేశాయని భూమిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తాప్సీ ‘అస్సీ’ ట్రైలర్ రిలీజ్.. మహిళల కోసం పోరాడే అడ్వకేట్ పాత్ర‌లో హైప్ పెంచిన హీరోయిన్

Next Story