ఆ ఫొటో కేవలం పోస్టర్ కాదు ఒక అపురూప క్షణం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

వీరి పెళ్లి సందర్భంగా వారు కలిసి నటిస్తున్న ‘రణబాలి’ (Ranabali)చిత్రం నుండి విడుదలైన ఒక ఓల్డ్ గెటప్ వెడ్డింగ్ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఆ ఫొటో కేవలం పోస్టర్ కాదు ఒక అపురూప క్షణం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల వివాహ వార్తతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. వీరిద్దరూ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఒక పురాతన ప్యాలెస్‌లో ఒకటయ్యారు. అయితే, వీరి పెళ్లి సందర్భంగా వారు కలిసి నటిస్తున్న ‘రణబాలి’ (Ranabali)చిత్రం నుండి విడుదలైన ఒక ఓల్డ్ గెటప్ వెడ్డింగ్ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఎమోషనల్ నోట్‌తో పంచుకున్నారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ అభిప్రాయం ప్రకారం, అది కేవలం ఒక పోస్టర్ కాదు, ఒక అపురూపమైన క్షణం. పాతకాలపు ఫోటోలలో ఉండే సహజత్వం, నిజాయితీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. మన తాతామామల కాలంలో కెమెరా ముందు ఎలాంటి కృత్రిమమైన చిరునవ్వులు, ఫోజులు ఉండకపోయేవని, ఆ పచ్చిదనమే ‘రణబాలి’ చిత్రానికి ప్రాణం అని ఆయన వివరించారు. ‘‘1800ల నాటి కాలం నాటి కథ ఇది.

ఆ రోజుల్లో వివాహాలు ఎంతో గౌరవంగా, బరువుగా ఉండేవి. విజయ్, రష్మిక ఆనాటి దుస్తులు ధరించి సెట్‌లోకి వచ్చినప్పుడు.. వారు నటుల్లా అనిపించలేదు, కాలంలో వెనక్కి ప్రయాణించిన నిజమైన జంటలా కనిపించారు’’ అని రాహుల్ చెప్పుకొచ్చారు. దర్శకుడు కోరుకున్నట్లుగానే ఎటువంటి నాటకీయ లైటింగ్ లేకుండా, చాలా సాదాసీదాగా ఆ ఫోటోను క్లిక్ చేశారట. సరిగ్గా అదే సమయంలో వారిద్దరూ నిజ జీవితంలో కూడా వివాహం చేసుకోవడం చూస్తుంటే.. కొన్నిసార్లు సినిమా, నిజ జీవితం ఒకదానికొకటి పలకరించుకున్నట్లు అనిపిస్తుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘బహుశా ఇది వారి గత జన్మకు సంబంధించిన వివాహ చిత్రమేమో అనిపిస్తుంది’’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కాలాతీత బంధమే రణబాలి చిత్రానికి అతిపెద్ద బలం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రీల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ ఈ జంట ఒక్కటవ్వడం అభిమానులకు పెద్ద పండగలా మారింది. ‘రణబాలి’లో వీరి వింటేజ్ లుక్ చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Next Story