ఆ క్షణం తడబడ్డ.. అందుకే పెళ్లికి ముందు గర్భవతిని అయ్యాను.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by Kavitha |
ఆ క్షణం తడబడ్డ.. అందుకే పెళ్లికి ముందు గర్భవతిని అయ్యాను.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ఇద్దరమ్మాయిలు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ – అమలాపాల్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. కానీ, ఈ మధ్యకాలంలో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రావడం తగ్గడంతో తమిళ ఇండస్ట్రీకే పరిమితమైంది. అక్కడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ అదరగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్లలో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్‌‌ను ప్రేమించి 2014లో పెళ్లి కూడా చేసుకున్నారు. అలా మూడేళ్లపాటు హ్యాపీగా ఉన్న వీరు 2019లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే విడాకులు తీసుకున్న వెంటనే ఆ ఏడాదే దర్శకుడు ఇంకో వివాహం చేసుకున్నాడు. అయితే అమలా పాల్ మాత్రం ఆ బాధ నుంచి బయటపడడానికి సినిమాల్లో నటించడం ప్రారంభించింది. తర్వాత వెబ్సైట్లో ఉన్న జగత్ దేశాయ్‌తో ప్రేమలో పడి గత ఏడాది మ్యారేజ్ చేసుకుంది. అలా పెళ్లి చేసుకున్న వీరికి ఇటీవలే ఇలై అనే కుమారుడు కూడా జన్మించాడు.


అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తన సెకండ్ మ్యారేజ్ గురించి కీలక విషయాలను వెల్లడించింది. అమలాపాల్ మాట్లాడుతూ.. నేను నా జీవితంలో మొదటి దశలో ఎంతో నష్టపోయాను. అందుకే రెండవ దశను ప్రారంభించడానికి కాస్త వెనకడుగు వేశాను. కానీ నా భర్త నా ఆలోచనలు అన్నింటినీ మార్చేశాడు.. మేము పెళ్లికి ముందు డేటింగ్ చేశాము. నా బాయ్ ఫ్రెండ్ నిర్ణయాలను కాదనలేక పోయాను. అందుకే డేటింగ్ చేసిన నెల రోజులకే నేను గర్భం దాల్చాను. అందుకే వెంటనే పెళ్లి చేసుకున్నాము అంటూ ఈ ముద్దుగుమ్మ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.




Advertisement

Next Story

Most Viewed