నాగ చైతన్య రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవడానికి కారణం అదే .. ఎట్టకేలకు వెలుగులోకి అసలు నిజం!

by Kavitha |
నాగ చైతన్య రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవడానికి కారణం అదే .. ఎట్టకేలకు వెలుగులోకి అసలు నిజం!
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరిద్దరి కాపురం మున్నాళ్ల ముచ్చటగా పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. మయోసైటీస్ కారణంగా ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ సమంత.. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇక నాగచైతన్య మాత్రం ‘తండేల్’ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే విడాకుల తర్వాత నాగ చైతన్య.. శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ తాజాగా చైతన్య యంగ్ బ్యూటీ శోభితతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా ఆగస్టు 8న ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక అప్పటి నుంచి వీరి ఫొటోలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఎక్కడ చూసినా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో.. అసలు నాగ చైతన్య-శోభిత‌ల నిశ్చితార్థం వేడుక అంత హడావుడిగా జరిపించడం.. అంత పెద్ద ఫ్యామిలీ వేడుక ఇండస్ట్రీ ప్రముఖులను కూడా ఆహ్వానించకుండా ముగించడం అనేది చర్చకు దారి తీసింది. అయితే తాజాగా ఈ విషయంపై నాగార్జున స్వయంగా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. “ఆగస్టు 8న మంచి ముహూర్తం కుదిరింది. అందుకే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ హడావుడిగా నిర్వహించాల్సి వచ్చింది. శోభిత-నాగ చైతన్య వివాహం చేసుకోవాలని ధృడంగా నిశ్చయించుకున్నారు. వారి జాతకాల ఆధారంగా గొప్ప ముహూర్తం దొరికింది. అందుకే నిరాడంబరంగా, అప్పటికప్పుడు నిశ్చితార్థం వేడుక జరపాల్సి వచ్చింది” అని నాగార్జున చెప్పుకొచ్చారు. కాబట్టి అందరూ అనుకున్నట్లు నాగ చైతన్యకు ఇది రెండో వివాహం కావడం వలన ఎంగేజ్మెంట్ ఘనంగా చేయలేదు అనేది నిజం కాదు. కాగా వీరి పెళ్లికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉన్నది.

Advertisement

Next Story