- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదే నా లక్ష్యం.. ఇక నుంచి అలాంటి పాత్రలే చేయాలని ఆశ పడుతున్నాను: శ్రద్ధా శ్రీనాథ్
యంగ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) ఇటీవల ‘డాకు మహారాజ్’సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) ఇటీవల ‘డాకు మహారాజ్’సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్’(The Game You Never Play Alone). ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా శ్రీనాథ్ తన సినిమా ఎంపికల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను కొద్ది రోజుల నుంచి అధికంగా పద్ధతిగల పాత్రలో నటించడానికి కారణం ప్రేక్షకులు నన్ను అలా చూడాలని కోరుకోవడమే. ఇకనుంచి నేను లవ్, రొమాన్స్‌తో పాటు సీక్రెట్ ఏజెంట్ వంటి అడ్వెంచర్, థ్రిల్లర్ యాక్షన్ చిత్రాల్లో నటించాలని ఆశగా ఉంది.
ఇక నుంచి నేను పద్ధతిగల పాత్రలు చేయాలనుకోవడం లేదు. అందరూ ఎక్కువ సినిమాలు చేయడంలేదని అడుగుతున్నారు.. అది నా లక్ష్యం కాదు. చేసింది తక్కువ సినిమాలే అయినా అందులో మంచిగా నటించి అభిమానులను అలరించడమే నా లక్ష్యం. కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి కథలు ఎంచుకోవాలనే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని డిసైడ్ అయ్యా. ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ విభిన్న కథలు.. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది.






