- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anupama Parameswaran : ఆ సంఘటన నన్ను ఎంతగానో గాయపరిచింది.. అందుకే ఇన్నాళ్లు దూరం అయ్యా
ఆ మేకపిల్లతో గడపడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది.

దిశ, సినిమా: తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘కార్తికేయ-2’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన తనను ఎంతగా కలచివేసిందో ఆమె వివరించారు. ‘కార్తికేయ-2’ షూటింగ్ సమయంలో సెట్స్‌లో ఒక మేకపిల్ల ఉండేదని, దానితో తాను ఎంతో ఇష్టంగా ఆడుకునేదాన్ని అని అనుపమ తెలిపారు. ‘‘ఆ మేకపిల్లతో గడపడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. అయితే ఒకరోజు షూటింగ్ గ్యాప్‌లో మాకు మటన్ బిర్యానీ వడ్డించారు. నేను తింటున్న సమయంలో నా అసిస్టెంట్ నా దగ్గరకు వచ్చి నవ్వుతూ.. 'మేడం, మీరు ఇప్పుడు తింటున్నది మీరు ఇందాక ఆడుకున్న మేకపిల్లనే' అని చెప్పాడు" అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. అసిస్టెంట్ చెప్పిన మాట వినగానే తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, వెంటనే వాంతులు చేసుకున్నానని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సంఘటన తనను ఎంతగా గాయపరిచిందంటే.. అప్పటి నుంచి తాను మటన్ ముట్టుకోవడమే మానేశానని తెలిపారు. దాదాపు కార్తికేయ-2 సమయం నుంచి ఇప్పటి వరకు మటన్ జోలికి వెళ్ళలేదని, అయితే ఇటీవల కాలంలోనే మళ్ళీ నెమ్మదిగా తినడం ప్రారంభించానని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వారంతా.. మూగజీవాల పట్ల ఆమెకు ఉన్న ప్రేమే ఆమెను అన్ని ఏళ్లపాటు మటన్‌కు దూరంగా ఉంచిందని, అనుపమ సున్నిత మనస్తత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక అనుపమ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘లాక్‌డౌన్’ సినిమాతో అలరించిన అనుపమ, ప్రస్తుతం ‘క్రేజీ కళ్యాణం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో తరుణ్ భాస్కర్, రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి, వీకే నరేష్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బూసమ్ జగన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






