- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ భయం నా భర్తలో ఎప్పుడూ ఉంటుంది.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు వైరల్
మన సమాజంలో మగవాళ్లు ఏదైనా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటే అందరూ ప్రశంసలు కురిపిస్తారు.

దిశ, సినిమా: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ, మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే ఆమె, మార్చి చివరి వారంలో ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మంచు లక్ష్మి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజం మహిళలను ఎలా జడ్జ్ చేస్తుందో వివరిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "మన సమాజంలో మగవాళ్లు ఏదైనా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటే అందరూ ప్రశంసలు కురిపిస్తారు. కానీ అదే పని ఒక మహిళ చేస్తే మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటారు. మేము చేస్తే సంసారం.. మీరు చేస్తే ఆ వ్యవహారం అనే సామెత మనకు తెలిసిందే.
ఆ సామెతను నేను పూర్తిగా చెప్పదలుచుకోలేదు కానీ, ఆడవాళ్ల విషయంలో సమాజం చూసే విధానం అలానే ఉంది" అని ఆమె ఘాటుగా స్పందించారు. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మంచు లక్ష్మి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. పెళ్లి సమయంలోనే తన భర్తకు ఒక గట్టి హెచ్చరిక లాంటి మాట చెప్పానని ఆమె వెల్లడించారు. "నేను పెళ్లి చేసుకునేటప్పుడే నా భర్తకు ఒక మాట చెప్పాను. నువ్వు ఏ పని చేయగలవో, అదే పని నేను కూడా చేయగలను అని గుర్తుంచుకోమన్నాను. అందుకే ఆయన ఏదైనా తప్పుడు పని చేయడానికి లేదా ఆ దిశగా ఆలోచించడానికి జంకుతారు. తను ఏదైనా చేస్తే.. నేను కూడా అదే చేస్తాననే భయం ఆయన మనసులో ఎప్పుడూ ఉంటుంది" అని లక్ష్మి ధీమాగా చెప్పారు. మహిళలు స్వతంత్రంగా ఉండాలని, తమ హక్కుల కోసం గళం విప్పాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






