ఆ దర్శకుడు నన్ను టార్గెట్ చేసి వేధించాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై లావణ్య త్రిపాఠి సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

తాను ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఆ చిత్ర దర్శకుడు తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించారు.

ఆ దర్శకుడు నన్ను టార్గెట్ చేసి వేధించాడు.. క్యాస్టింగ్ కౌచ్‌పై లావణ్య త్రిపాఠి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా కోడలు, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అత్యంత చేదు అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే చీకటి కోణం క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. లావణ్య మాట్లాడుతూ.. తాను ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఆ చిత్ర దర్శకుడు తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించారు. ఆ దర్శకుడి ప్రవర్తన వల్ల తాను తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యానని, తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ముఖం మీదే చెప్పేశానని తెలిపారు. అయితే, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తన పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వద్దన్నందుకు ఆ దర్శకుడు, టీమ్ ఆమెను టార్గెట్ చేసి వేధించడం మొదలుపెట్టారు.

"ఆ సమయంలో నాకు ఎవరూ మద్దతుగా నిలవలేదు. పైగా నాపై తప్పుడు కేసులు పెట్టారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించారు. ఒక పద్ధతి ప్రకారం నన్ను మానసికంగా కుంగదీయడానికి ప్రయత్నించారు" అని లావణ్య ఎమోషనల్ అయ్యారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక గంటల తరబడి ఏడ్చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఒంటరిగా పోరాడిన లావణ్య, ఇప్పుడు మెగా కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టి ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. హీరోయిన్లుగా ఇండస్ట్రీకి వచ్చే వారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని, కానీ వాటిని ఎదురించి నిలబడాలని ఆమె ఈ ఇంటర్వ్యూ ద్వారా సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story