ఆ అవార్డు నా హృదయాన్ని తాకింది.. ఎంతో గర్వంగా ఉందంటూ సుకుమార్ ఎమోషనల్ నోట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) ‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ అవార్డు నా హృదయాన్ని తాకింది.. ఎంతో గర్వంగా ఉందంటూ సుకుమార్ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) ‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇటీవల ఆయన కూతురు సుకృతి వేణి(Sukriti Veni) కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇటీవల ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తబితా సుకుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావు నిర్మించిన ఈ సినిమాను పద్మావతి మల్లాది నిర్మించారు.

జనవరి 24న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ మూవీ జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైంది. తాజాగా, ఈ విషయంపై సుకుమార్ స్పందిస్తూ ఇన్‌స్టా ద్వారా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ‘‘నా ప్రియమైన ముద్దుల కూతురు సుకృతి నేషనల్ అవార్డుకు ఎంపిక అయ్యారన్న విషయం తెలిసిన ఆ క్షణం నా నోట మాట రాలేదు. నా ప్రయాణంలో ఎన్నో అవార్డులు వచ్చాయి కానీ ఈ అవార్డు నా హృదయాన్ని తాకింది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘గాంధీ తాత చెట్టు’ మూవీ చూస్తున్న సమయంలో నా కూతురు అనే విషయాన్ని మర్చిపోయాను.

ఆ పాత్రలో నటిస్తున్న అమ్మాయిగానే సుకృతిని చూశాను. నీ కళ్ళలో ఎంతో నిజాయితీ, భావోద్వేగం చూశాను. సినిమా సెట్‌లో సరదాగా మొదలైన ఈ పని ఇప్పుడు నిన్ను అందరూ గర్వించేలాగా చేసింది. నీపై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే.. వాటి ముందు ఈ అవార్డు అంత గొప్పదిగా అనిపించడం లేదు. ఇలా నువ్వు గొప్ప స్థాయికి రావడం, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story