- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్.. ట్రంప్ పాలసీతో తలకిందులైన జీవితం!
ఈ ప్రపంచంలో కొందరికి ప్రేమ కావాలి.. కొందరికి డబ్బు కావాలి.. కొందరికి ప్రపంచమే కావాలి" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై ఆకట్టుకుంటోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ యాక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘గాయపడ్డ సింహం’. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న తరుణ్ భాస్కర్, ఈసారి ఒక గ్లోబల్ సమస్యను డార్క్ హ్యూమర్‌తో కలిపి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, పవన్ సాదినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా, విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. "ఈ ప్రపంచంలో కొందరికి ప్రేమ కావాలి.. కొందరికి డబ్బు కావాలి.. కొందరికి ప్రపంచమే కావాలి" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై ఆకట్టుకుంటోంది. అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలని కలలు కనే ఒక సామాన్య యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలోని కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా అతను డిపోర్ట్ (దేశం నుండి వెనక్కి పంపబడటం) అవుతాడు. ఈ ఒక్క ఘటనతో అతని జీవితం తలకిందులవుతుంది.
అమెరికా వెళ్తాడనే ఆశతో అతనిని ప్రేమించిన ప్రేయసి కూడా దూరమవుతుంది. అటు భవిష్యత్తు, ఇటు ప్రేమ రెండూ దెబ్బతినడంతో ఆ యువకుడిలో కలిగిన నిరాశ, ఆవేదన అతనిని ఒక విచిత్రమైన ప్రతీకారం వైపు ఎలా నడిపించాయి అనేదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ నెగటివ్ రోల్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ఒక స్పెషల్ ఎక్స్‌టెండెడ్ కామియో రోల్‌లో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుత కాలంలో విదేశాలకు వెళ్లాలనుకునే యువత ఎదుర్కొంటున్న ఇమిగ్రేషన్ సమస్యలను, ఇటు ఎమోషన్స్, అటు సెటైర్, డార్క్ హ్యూమర్‌తో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మే 1న ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాబోతోంది. ట్రైలర్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ 'గాయపడ్డ సింహం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






