- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'జగమే మాయ'కు ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: చిత్ర బృందం
ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జగమే మాయ'.

దిశ, సినిమా: ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'జగమే మాయ'. సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్యాపి స్టూడియోస్ బ్యానర్‌పై ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించారు. అయితే ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా మూవీ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడాని ఉదాహరణగా తమ చిత్రం నిలిచిందని, ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ తమిళ్‌లో విడుదల చేసిన మూవీ టాప్ ట్రెండింగ్‌లో ఉందన్న దర్శకనిర్మాతలు.. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తుందని, ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరితోపాటు చిత్రాన్ని ప్రమోట్ చేసిన మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి : దీపిక బర్త్ డే.. స్పెషల్ పిక్ షేర్ చేసిన షారుఖ్






