Thandel: ‘తండేల్’ కోసం నాగ చైతన్య, సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అస్సలు ఊహించి ఉండరుగా

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel).

Thandel: ‘తండేల్’ కోసం నాగ చైతన్య, సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అస్సలు ఊహించి ఉండరుగా
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌(Geeth Arts Banner)పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. యథార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లవర్స్ కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, గ్లింప్స్ ఆకట్టుకోగా.. సాంగ్స్‌కి అయితే ప్రత్యేక రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవచ్చు.

ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్‌కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. తండేల్ కోసం నాగ చైతన్య, సాయి పల్లవి రెమ్యునరేషన్‌గా భారీగానే తీసుకున్నారట. అయితే ఈ చిత్రం కోసం చైతన్య చాలా కష్టపడ్డారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ కోసం ఆయన దాదాపు 15 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని సమాచారం. ఇప్పటివరకు నాగచైతన్య కెరీర్‌లో అందుకున్న భారీ పారితోషకం ఇదే. అలాగే సాయి పల్లవి చాలా డిమాండ్ ఉన్న నటి .

తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో బిజీగా రాణిస్తుంది. గ్లామర్ మీద ఆధారపడకుండా, నటనతో తన సత్తా ఏంటో చూపిస్తూ అందరి మనసులు గెలుచుకుంటుంది. ఇక ‘తండేల్ ‘ సినిమాలో నటించినందుకు సాయి పల్లవికి రూ.5 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కాగా దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మ్యూజిక్ అందించిన ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఇప్పటికే ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి ఈ చిత్రంతో చైతన్య ఎలాంటి విజయం సాధిస్తాడో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story