తారక్ అన్న తోడుగా వచ్చారు.. నాకు బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయినట్లే

by Disha Web Desk 6 |
తారక్ అన్న తోడుగా వచ్చారు.. నాకు బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయినట్లే
X

దిశ, సినిమా: డైనమిక్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ మూవీ మార్చి 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చిన తారక్.. ‘సినిమా అంటే చెప్పలేనంత ఇష్టమున్న విశ్వక్‌ని ప్రోత్సహించాలి. ‘దాస్ కా ధమ్కీ’ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. భవిష్యత్‌లో విశ్వక్ తీయబోయే మరిన్ని సినిమాలకి ఇది ఆదర్శం కావాలి. ‘ఆర్ఆర్ఆర్’ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఇంకా ముందుకు సాగాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా’ అన్నాడు. ఈ వేడుకకు తారక్ అన్న రావడం ఆస్కార్ వచ్చినదానికంటే సంతోషంగా ఉందన్న విశ్వక్.. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన వేడుకకు వస్తానని మెసేజ్ పెట్టగానే కన్నీళ్లు ఆగలేదంటూ థాంక్స్ చెప్పాడు.

Next Story