రవితేజ సినిమాలో నటించనున్న తమిళ్ స్టార్ హీరో విక్రమ్

by Disha Web Desk 10 |
రవితేజ సినిమాలో నటించనున్న తమిళ్ స్టార్ హీరో విక్రమ్
X

దిశ, సినిమా: ప్రస్తుతం మాస్ రాజా రవితేజ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్ ఫట్ సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమా కోసం కేటాయించిన డేట్స్‌ను, ఈ మూవీకి షిఫ్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్‌కు ఇదే మంచి సమయం అని చెప్పాలి.

అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తమిళ నటుడు విక్రమ్‌ను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన సెకండ్ హాఫ్‌లో 20 నిమిషాలపాటు కనిపించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ స్టోరీని ఇప్పటికే విక్రమ్‌కు వినిపించగా అతను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed