Tamannaah Bhatia : అభిమాని చేసిన పనికి తమన్నా షాక్ (వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2023-07-08 12:42:57  IST  )

హ్యపీడేస్ మూవీతో తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమన్నా.

Tamannaah Bhatia : అభిమాని చేసిన పనికి తమన్నా షాక్  (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యపీడేస్ మూవీతో తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమన్నా. అనంతరం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించారు. జీ కర్దాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా, లస్ట్ స్టోరీస్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ రెండు సిరీస్ లలో తమన్నా హాట్ సీన్స్‌లో నటించారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనికి తమన్నా షాక్ అయ్యారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో తమన్నా ఓ అభిమానిని కలిసింది. తమన్నాను చూసిన ఆ వ్యక్తి వెంటనే ఆమె కాళ్లు పట్టుకున్నాడు. ఓ బొకే తమన్నాకు అందించాడు. అనంతరం తన చేతి మీద ఉన్న తమన్నా ఫేస్ టాటూ చూయించాడు. దీంతో తమన్నా ఎమోషనల్ అయింది. వెంటనే అతడిని కౌగించుకుంది. ఐ లవ్ యూ అని చెప్పింది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story