- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంపర్ ఆఫర్ అందుకున్న తమన్నా భాటియా.. ‘AK-64’ సినిమాలో స్టార్ హీరోతో రొమాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) గత కొద్ది కాలంగా గ్లాబర్ డోస్ పెంచేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) గత కొద్ది కాలంగా గ్లాబర్ డోస్ పెంచేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే బోల్డ్ సీన్స్ చేయడంతో పాటు ఐటెం సాంగ్స్‌లోనూ చిందులేస్తోంది. గత ఏడాది ‘స్త్రీ-2’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల రైడ్-2, ఓదెల-2 (Odela-2)వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సిద్ధార్థ్ మల్హోత్రా ‘వ్యన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’(VVn Force of the Forest) మూవీలో నటిస్తోంది.
తాజాగా, మిల్కీ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)64వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. అయితే ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ‘AK-64’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుండగా.. ఇందులో నయనతార కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయనున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






