షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..ఛీ..ఛీ వాంతులు వస్తున్నాయంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘శ్రీ’సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..ఛీ..ఛీ వాంతులు వస్తున్నాయంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘శ్రీ’సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, అవారా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా వరుస అవకాశాలు దక్కించుకున్న తమన్నా అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్స్‌తో నటించడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. తెలుగు, తమిళ హిందీ చిత్రాల్లో నటిస్తున్న తమన్నా స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇటీవల ‘ఓదెల-2’(Odela-2) మూవీతో ప్రేక్షకులను అలరించింది.’

వరుస మూవీస్‌లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా, తమన్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించిన ఆమె జుట్టును మరీ పైకి కట్టుకుని వెరైటీ లుక్‌లో కనిపించింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు సూపర్, వెరీ హాట్ అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఛీ..ఛీ నిన్ను చూస్తుంటే వాంతులు వస్తున్నాయంటూ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

link

Next Story