Bunny Vasu: ‘మీ ట్రోల్స్ నా వెంట్రుకతో సమానం’.. దుమారం రేపుతున్న బన్నీ వాసు కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-14 06:20:23  IST  )

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) జీఏ2 బ్యానర్‌పై ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి లాభాలు పొందారు.

Bunny Vasu: ‘మీ ట్రోల్స్ నా వెంట్రుకతో సమానం’.. దుమారం రేపుతున్న బన్నీ వాసు కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) జీఏ2 బ్యానర్‌పై ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి లాభాలు పొందారు. రీసెంట్‌గా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో ‘మిత్రమండలి’ (mithra mandali)మూవీ రాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 16న రిలీజ్ కాబోతుంది. దీంతో కొంతమంది ఈ సినిమాపై ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బన్ని వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు. ఇక్కడ ఏదో తొక్కితే నేను పడిపోతా అనుకుంటున్నారేమో అదంతా నా వెంట్రుక. నా సంస్కారం ఎంతటిది అంటే నేను ఇంకో వెంట్రుక కూడా తీసి ఇవ్వగలను.

కానీ తల మీద వెంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. నేను ఎప్పటికీ పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా నేను పరిగెడుతూనే ఉంటా. మీ గురించి నేనేమి పెద్దగా ఆలోచించడం లేదు. ఎంత ట్రోలింగ్ చేస్తారో చేసుకోండి. ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నాను. ట్రోల్ చేయడానికి కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి.మీ పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి నెగిటివ్‌గా పెడుతున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు తీసుకొని చేయండి. పొగడటానికి తక్కువ తీసుకోండి గాని అవతలవాడిని తిట్టడానికి మాత్రం ఎక్కువ తీసుకోవాలి. బాగా ప్రిపేర్ అయి ఉంటారు. నెగిటివ్ ట్రోల్స్ చేయాలని. సినిమా బాగుంటే ఆడుతుంది.. ఒక్కోసారి నిరాశకు గురవ్వాల్సి వస్తే అదే చేస్తాం.

అంతేకానీ దీన్ని ఎక్కువ తీసుకొని.. దీని గురించి ఆలోచించే అంత లో అటిట్యూడ్ అయితే నాది కాదు.. బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు. ఎవరు ఏమి చేయలేం. అందరం ఇక్కడ ఇండస్ట్రీలో కలిసి ఉండాల్సిన వాళ్లమే. కలిసి ఉండి ఎదగాల్సిన వాళ్లం.ఇదేదె ఒక సిచ్యువేషన్ అంతే. ఒక సినిమా వస్తే నెగిటివ్ కామెంట్స్ పెట్టిద్దాం, నెగిటివ్ ప్రోపగండా చేద్దాం అనుకుంటే పైన ఆ దేవుడు ఉన్నాడు. చూసే ప్రేక్షకులు ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అసలు ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నాడా అని అంతా ఆలోచనలో పడ్డారు.

లింక్

READ MORE ......

ఆ స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న అట్లీ.. కాంబో సూపర్ అంటున్న నెటిజన్లు


Next Story