అతడే నాలో ఊహించని మార్పు తీసుకొచ్చాడు : టబు ప్రశంసలు

by Disha Web Desk 7 |
అతడే నాలో ఊహించని మార్పు తీసుకొచ్చాడు : టబు ప్రశంసలు
X

దిశ, సినిమా: సీనియర్ నటి టబు దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌పై ప్రశంసలు కురిపించింది. 2003లో 'మక్బూల్', 2007లో 'ది నేమ్‌సేక్‌' సినిమాల్లో ఇర్ఫాన్ సరసన నటించిన ఆమె.. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌లో గొప్ప ప్రదర్శనలుగా పేర్కొంది. అలాగే ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత తనలో ఊహించని మార్పు వచ్చిందన్న నటి.. తాను పోషించే పాత్రలకు ఎలా కట్టుబడి ఉండాలో ఇర్ఫాన్ నేర్చించినట్లు చెప్పింది.

అంతేకాదు ఆయన తనను ఎంతో ప్రభావితం చేశాడని తనను తాను భిన్నంగా చూసుకునేలా తీర్చిదిద్దాడని తెలిపింది. ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ గురించి కూడా మాట్లాడిన ఆమె.. అజయ్ నటుడిగా చాలా సరదాగా ఉన్నప్పటికీ దర్శకుడి కుర్చీలో కూర్చోగానే పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తాడని, ముఖ్యంగా సెట్‌లోకి ప్రవేశించగానే ఒక్కసారిగా సూపర్ సీరియస్ మనిషిగా మారతాడంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఇక అజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోలా'లో టబు నటిస్తుండగా.. 2023 మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ తమిళ హిట్ 'ఖైదీ'కి హిందీ రీమేక్.



Next Story

Most Viewed