తన కూతురిని పరిచయం చేసిన టబు.. 54 ఏళ్ల వయసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చిందిగా!

by Mallepaka Hamsa |

ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు(Tabu) అందరికీ సుపరిచితమే.

తన కూతురిని పరిచయం చేసిన టబు.. 54 ఏళ్ల వయసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చిందిగా!
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు(Tabu) అందరికీ సుపరిచితమే. అక్కినేని నాగార్జున ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను అందుకున్న టబు.. అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అందం, అభినయం, గ్లామర్‌కు తోడు సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగు, హిందీ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తనతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడినా.. టబు మాత్రం సినిమాలకే పూర్తి ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటివరకు బ్యాచిలర్ లైఫ్‌ను కొనసాగిస్తోంది.

వయస్సు పెరిగినా ఆమె ఎంపిక చేసుకునే పాత్రలు, నటనకు వచ్చే ప్రశంసలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అలాగే లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. 54 ఏళ్ల వయసులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేయడం ఆమె స్థాయిని మరోసారి నిరూపిస్తోంది. ప్రస్తుతం టబు తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. పూరి స్టైల్‌లో టబు పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి కూడా పెరుగుతోంది.

ఇదిలా ఉండగా, తాజాగా టబుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని టబు ఒక్కసారిగా “తన కూతురు” అంటూ ఓ అమ్మాయిని పరిచయం చేయడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. అసలు టబుకు కూతురా? ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. ఇంద పెద్ద షాకిచ్చావేంటి మేడమ్ అని అంతా ఒక్కసారిగా హవాక్కు అవుతున్నారు. అయితే ఆమె నిజమైన కూతురి కాదని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా(Fatima Sana Shaikh).. టబు 1997లో ‘చాచి 420’ సినిమాలో తల్లికూతురుగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా ఫాతిమాను తన కూతురు అంటూ టబు పరిచయం చేయడంతో ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు.

Next Story