మ‌రో తెలుగు హీరోతో ట‌బు సినిమా ?

by velandi.Saikiran |

నాగార్జున ఒక్క‌డే కాదు, మ‌రో తెలుగు హీరోతో ట‌బు సినిమా చేయ‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

మ‌రో తెలుగు హీరోతో ట‌బు సినిమా ?
X

దిశ‌, వెబ్ డెస్క్: అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులోనే కాకుండా హిందీలో కూడా చాలా సినిమాలు చేశారు. ముఖ్యంగా తెలుగులో విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున లాంటి అగ్రశ్రేణి హీరోలతో అప్పట్లో చాలా సినిమాలే చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిపోయిన ఈ 54 ఏళ్ల నటి టబు, ఇటీవల అలా వైకుంఠపురంలో సినిమాలో కూడా మెరిశారు. ఈ సినిమాలో తల్లి పాత్రలో కనిపించారు.

ఇక ఇప్పుడు అక్కినేని నాగార్జున చేయబోతున్న 100వ సినిమాలో కూడా టబు నటిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత విక్టరీ వెంకటేష్ చేసే ప్రాజెక్టులో టబు స్పెషల్ రోల్ చేయబోతున్నారట. ఈ మేరకు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అనిల్ రావిపూడి ఈ మేరకు స్కెచ్ వేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఏ సినిమాలో టబును వాడతారు ? అనే దాని పైన క్లారిటీ రాలేదు. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా అనిల్, వెంకీ మామ కాంబో రెండు సినిమాలు త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్నాయి.

Next Story