ఓటీటీలోకి వచ్చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిడింబ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Chukka Sudharani |

టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు, నందిత శ్వేత కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘హిడింబ’.

ఓటీటీలోకి వచ్చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిడింబ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు, నందిత శ్వేత కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘హిడింబ’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి కన్నెగంటి దర్శకత్వం వహించారు. జూలై 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. అయితే.. థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫాం పై సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ఆహా సొంతం చేసుకోగా.. ఆగస్టు-10 రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Next Story