- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్య బర్త్ డే స్పెషల్.. అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న ‘కరుప్పు’ మూవీ టీమ్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతోంది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతోంది. హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొద్ది కాలంగా సూర్య హిట్ కోసం తాపత్రయపడుతున్నాడు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని ఆర్జే బాలాజీ(RJ Balaji) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ (Karuppu)టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలవగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీలో సూర్య సరసన స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)హీరోయిన్‌గా నటిస్తోంది.
దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మి్స్తున్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ భారీ ధరకు కొనుగోలు చేసింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘కరుప్పు’కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జులై 23న సూర్య పుట్టినరోజున మూవీ మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ‘కరుప్పు’ టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






