- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
25ఏళ్ల కుర్రాడిలా మారబోతున్న సూర్య.. మళ్లీ కాలేజీకి వెళ్తాడట!
తమిళ్ స్టార్ హీరో సూర్య అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది.

X
దిశ, సినిమా : తమిళ్ స్టార్ హీరో సూర్య అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. ప్రస్తుతం సూర్య, శివ కాంబోలో ‘కంగువా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ పూర్తికాగానే సుధా కొంగరతో మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాడు సూర్య. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చేశాయని తెలుస్తుండగా తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఇందులో సూర్య కాలేజీ కుర్రాడిలా కొంత సేపు కనిపించనున్నాడని, దీంతో అచ్చం 25ఏళ్ల కుర్రాడిలా కనిపించే లుక్ కోసం ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్‌పై నిర్మించనుండగా దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.
- Tags
- Surya
Next Story






