తెలుగు స్టేట్‌లలో రికార్డ్ క్రియేట్ చేసిన ‘సూర్య s/o కృష్ణన్‌’

by Dishanational2 |
తెలుగు స్టేట్‌లలో రికార్డ్ క్రియేట్ చేసిన ‘సూర్య s/o కృష్ణన్‌’
X

దిశ, సినిమా: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులో విడుదల చేస్తూ ఇక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. 2008లో సూర్య నటించిన సూపర్ హిట్ మూవీ ‘సూర్య s/o కృష్ణన్‌’ 15 ఏళ్ల తర్వాత ఆగస్టు 4న థియేటర్లలో మళ్లీ విడుదల చేయబడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహంచని విధంగా ఈ సినిమా షోలన్నీ హౌస్‌ ఫుల్ అయ్యాయి. ఇక రీ రిలీజైన తొలిరోజే ఒక కోటి గ్రాస్ అందుకుంది. కోలీవుడ్ నుంచి మొట్ట మొదటగా రిలీజైన ఈ సినిమాకు ఒక్క రోజులోనే 24 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. దీనిని బట్టి సూర్యకున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఇక ఈ వీక్ ఎండ్‌లో మరిన్ని కలెక్షన్‌లు రాబట్టే ఛాన్స్ ఉంది.

Read More: Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సలార్’ ఫస్ట్ సింగిల్ అప్పుడే!

Next Story

Most Viewed