- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల చిత్రం నుంచి తప్పుకున్న Surya
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ బాల కలయికలో రాబోతున్న చిత్రం 'వనంగాన్'..

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ బాల కలయికలో రాబోతున్న చిత్రం 'వనంగాన్'. వీరిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. అయితే దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తైన సినిమా నుంచి సూర్య తప్పుకున్నట్లు దర్శకుడు బాల స్వయంగా ప్రకటించాడు. 'కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. దాని కారణంగా స్టోరీకి సూర్యకు సరిపోదని అర్థమైంది. ఆయనకు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నా. సూర్య తప్పుకున్నా ఈ సినిమా కొనసాగుతుంది' అని చెప్పాడు. దీంతో నిర్మాతగా కూడా సూర్య తప్పుకున్నట్లు తెలుస్తుండగా ఆయన స్థానంలో వస్తున్న హీరో ఎవరనేది చర్చనీయాంశమైంది.
Also Read......
'బాయ్‌కాట్ రష్మిక మందన్న'.. రిషబ్‌శెట్టి ఫ్యాన్స్ ట్రోలింగ్
Next Story






