'వాడి వాసల్' నుంచి సూర్య తప్పుకోలేదు: క్లారిటీ ఇచ్చిన నిర్మాత

by Disha Web Desk 10 |
వాడి వాసల్ నుంచి సూర్య తప్పుకోలేదు: క్లారిటీ ఇచ్చిన నిర్మాత
X

దిశ, సినిమా : తమిళ స్టార్ హీరో సూర్య మంచి ఫామ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కాగా సూర్య గతంలో దర్శకుడు వెట్రిమారన్‌‌తో 'వాడివాసల్' సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే మొన్నటి వరకు ఈ సినిమా ఆగిపోయిందని, సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే వాస్తవంగా చెప్పాలంటే దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం 'విడుదలై' అనే క్రైమ్ థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. దీంతో సూర్య సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మూవీ ఆగిపోయింది అంటూ కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై నిర్మాత కలైపులి ఎస్‌.థాను క్లారిటీ ఇచ్చాడు. 'ఆ వార్తల్లో నిజం లేదని, ఫేమ్‌ పొందేందుకే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపాడు.

ఇవి కూడా చదవండి : 'మా బావ మనోభావాలు'.. 'Veera Simha Reddy' నుంచి మరో Song Release!

Next Story