- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిట్ డైరెక్టర్‌తో సూర్య భారీ ప్రాజెక్ట్.. కలిసొచ్చేనా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya)కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆయన హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya)కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆయన హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘కరుప్ప’ (karuppu)సినిమాను చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri)తో ఓ భారీ ప్రాజెక్ట్‌ను చేయనున్నారు. ఇక ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, సూర్య మరొక యంగ్ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్(Arun Matheswaran) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. అయితే ఇటీవల ఆయన సూర్యను కలిసి ఓ కథ చెప్పగా అది బాగా నచ్చడంతో వెంటనే ఒకే చేసినట్లు సమాచారం. అయితే ఇది ఇంతకు ముందు ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్నారనే ప్రచారం వచ్చింది. కానీ అది క్యాన్సిల్ అయి సూర్య చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అరుణ్ అయినా సూర్యకు హిట్ ఇస్తాడేమే చూడాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






