- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల వల్ల వెనక్కి తగ్గిన సూర్య.. ‘కరుప్పు’ వాయిదాపై దర్శకుడు ఆసక్తికర కామెంట్స్
నిజానికి ‘కరుప్పు’ సినిమాను గత దీపావళికి లేదా సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విలక్షణ దర్శకుడు ఆర్.జె. బాలాజీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ . స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఆర్.జె. బాలాజీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నిజానికి ‘కరుప్పు’ సినిమాను గత దీపావళికి లేదా సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, గ్రాఫిక్స్ (CG) పనులు పూర్తికావడానికి సమయం పట్టడంతో పొంగల్ లోపు సినిమాను సిద్ధం చేయలేకపోవడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత జనవరి 23 లేదా ఫిబ్రవరి 17 వంటి సాధారణ రోజుల్లో సినిమాను రిలీజ్ చేయడం దర్శకుడు బాలాజీకి ఇష్టం లేకపోవడంతో మరోసారి రిలీజ్ వాయిదా పడింది. సినిమా స్థాయికి తగ్గట్లుగా ఒక పెద్ద పండుగ లేదా పీక్ సీజన్‌లో విడుదల చేయాలని ఆయన పట్టుబట్టారు.
సినిమాను ఏప్రిల్‌లో ‘తమిళ నూతన సంవత్సరం’ సందర్భంగా విడుదల చేద్దామనుకున్నప్పటికీ, అప్పుడు రాజకీయ ప్రచారాలు జోరుగా సాగుతాయని బాలాజీ వివరించారు. రాజకీయ వేడిలో సినిమాను విడుదల చేస్తే ప్రజలు రెండు రోజుల్లోనే దాని గురించి మర్చిపోయే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. మే 4 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి, ప్రజలు మానసిక ప్రశాంతత కోసం కొంత వినోదాన్ని ఆశిస్తారని బాలాజీ తెలిపారు. అందుకే మే 14న ‘కరుప్పు’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. "ఆలస్యం జరిగినప్పటికీ, ఆ నిరీక్షణకు తగిన ఫలితం దక్కుతుంది. సూర్య ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఒక పక్కా ట్రీట్ లా ఉంటుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.






