ప్రభాస్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన సూర్య.. (వీడియో)

by Disha Web Desk 7 |
ప్రభాస్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన సూర్య.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దిశా పటానీ జంటగా నటిస్తున్న సినిమా ‘కంగువా’. డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ పాన్ ఇండియన్ రేంజ్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు పది భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సౌత్ హీరోల్లో ఇప్పుడు సూర్యకు మంచి క్రేజ్ & డిమాండ్ ఉంది. కరోనా సమయంలో ఓటీటీలో విడుదల చేసిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. అలా సూర్య మార్కెట్ మళ్లీ ఓపెన్ అయింది. ఎన్నో ఏళ్ల తరువాత సూర్యకు మంచి హిట్లు పడ్డాయి.

దీంతో సూర్యతో భారీ సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శివ ఈ భారీ ఫిక్షన్ కథను చెప్పాడు. పాన్ ఇండియన్ రేంజ్‌లో సినిమాను ప్లాన్ చేశాడు. కంగువా అంటూ టైటిల్‌ను ప్రకటించడంతో మంచి హైప్ పెంచేశాడు. ఇప్పుడు కంగువా గ్లింప్స్‌ను రిలీస్ చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఈ గ్లింప్స్‌లో దేవీ శ్రీ ప్రసాద్ తన సత్తాను చాటాడు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ అయితే నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. శివ ఈ సినిమాతో అందరినీ ఆశ్చర్యపర్చడం ఖాయమనిపిస్తోంది. ఇక ఈ గ్లింప్స్‌లో సూర్య నిజంగానే అందరినీ భయపెట్టేశాడు. విలనా? హీరోనా? అన్న అనుమానం వచ్చేలా నటించాడు. మరి ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story

Most Viewed