- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవితేజ, పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి భారీ ప్లాన్..!
ఏజెంట్ సినిమాతో నెగిటివ్ పేరు తెచ్చుకున్న టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి రెండు సరికొత్త ప్రాజెక్టులకు ప్లాన్

దిశ, వెబ్ డెస్క్ : ఏజెంట్ సినిమాతో నెగిటివ్ పేరు తెచ్చుకున్న టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి రెండు సరికొత్త ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే రవితేజతో కిక్ లాంటి సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కథ కూడా సిద్ధం చేశాడట. రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ ప్రాజెక్టుపై సురేందర్ రెడ్డి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రవితేజ సినిమా ఓకే కాకపోతే సురేందర్ రెడ్డి దగ్గర సెకండ్ ప్లాన్ కూడా ఉందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేసేందుకు కూడా సురేందర్ రెడ్డి కథ రాసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఆ సినిమా చేయాల్సి ఉండేదట.
కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దానివల్ల ఆ ప్రాజెక్టు పెండింగ్ లో ఉందట. ఈ రెండిటిలో ఏదైనా ఒకటి ఫైనల్ అయినా, ఇండస్ట్రీని షేక్ చేసేస్తానని సురేందర్ రెడ్డి బిగ్ స్కెచ్ వేసుకొని కూర్చున్నాడట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. మరి ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏది వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా దర్శకుడు సురేందర్ రెడ్డి దాదాపు పది సినిమాలు ఇప్పటి వరకు తీశారు. ఇందులో కిక్, అతనొక్కడే, రేసుగుర్రం, ధ్రువ, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.
READ MORE ...
‘లోకా’ విషయంలో వారు అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా.. నాగవంశీ సెన్సేషనల్ కామెంట్స్






