ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ లో సుప్రీమ్ స్టార్.. స్పెషల్ పోస్టర్ షేర్ చేసి అంచనాలు పెంచిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు.

ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ లో సుప్రీమ్ స్టార్.. స్పెషల్ పోస్టర్ షేర్ చేసి అంచనాలు పెంచిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంతో పాటు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో పాటుగా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ప్రదీప్ రంగనాథన్‌కు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్’(Dude). కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మమితా బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తోంది.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రదీప్ రంగనాథ్ సినిమాలో సుప్రీమ్ స్టార్ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ పుట్టినరోజు కావడంతో ‘డ్యూడ్’ నుంచి ఆయన పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో తెల్ల చొక్కా పంచె ధరించిన ఆయన సైకిల్ మీద వెళ్తూ మాస్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

link

Next Story